
జనరల్

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ప్రత్యర్థులతో కలిసి పనిచేసిన పారిశ్రామిక వేత్తలు, సంస్థలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా కేఎంవీ సంస్థకు ఎయిర్‌పోర్టు టెర్మినల్ కాంట్రాక్ట్ ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ, ప్రత్యర్థులతో పనిచేసిన సంస్థలకు కాంట్రాక్టులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
గన్నవరం ప్రజాప్రతినిధిగా తన హక్కులు, ప్రోటోకాల్ పరంగా తనకు దక్కాల్సిన గౌరవం విషయంలో రాజీ పడబోనని యార్లగడ్డ స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో అవినీతి జరిగితే ఎవరినీ ఉపేక్షించబోనని హెచ్చరించారు. ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, త్వరలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంశాలపై విస్తృతంగా మాట్లాడనున్నట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!