
జనరల్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. యుద్ధం తగ్గుముఖం పట్టినట్లు కనిపించినప్పటికీ, తాజాగా ఇరాన్ మరియు అమెరికా మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. హర్మూజ్ సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్న నౌకలపై ఐఆర్‌జీసీ దాడులు జరపడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. దీంతో ప్రాంతీయ భద్రత, అంతర్జాతీయ వాణిజ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే సమయంలో, ఇరాన్ స్థానిక మీడియా 13 మంది విదేశీ నేతల పేర్లతో ‘ప్రతీకార జాబితా’ను విడుదల చేసింది. ఇందులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సహా పలువురు నేతల పేర్లు ఉన్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో అయతుల్లా అలీ ఖమేనీ మరణించగా, ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!