
జనరల్

అసెంబ్లీలో 22ఏ భూముల అంశంపై స్వల్పకాలిక చర్చ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ అంశంపై ఏ నుంచి జెడ్ వరకు చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎలాంటి అంశాన్ని చర్చకు తీసుకొచ్చినా ప్రభుత్వానికి అభ్యంతరం లేదని పేర్కొన్నారు.
బీఏసీ సమావేశంలో ప్రతిపక్షాలు ప్రతిపాదించే అంశాలపైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సభా కార్యక్రమాలకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!