
జనరల్

పేపర్‌మిల్లు నుంచి పెనాల్టీలు, పన్నులు ఎలా వసూలు చేయాలో సంబంధిత మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేయడమే పార్టీ ప్రధాన అజెండా అని తెలిపారు.
కూటమి పార్టీల మధ్య సీట్ల కేటాయింపులో ఎలాంటి నిర్దిష్ట ఫార్ములా లేదని, పరస్పర సమన్వయంతో సీట్ల పంపకం జరుగుతుందని పురందేశ్వరి చెప్పారు. సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడమే బీజేపీ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!