

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం, వేర్పాటువాదమే దేశానికి అసలైన ముప్పు అని ఆరోపించారు. అప్రమత్తంగా ఉండాల్సింది వారి భావజాలం నుంచేనని, బీజేపీని రాజకీయంగా ఏకాకిని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ తీవ్రవాదాన్ని వ్యతిరేకించే ‘దిమాగి నక్సల్’గా తాను గర్వపడతానని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అసహనం, భయం, అభద్రతను ప్రతిబింబిస్తున్నాయని షర్మిల విమర్శించారు.
ప్రతిపక్షాలను అవమానించేందుకు ‘అర్బన్ నక్సల్స్’, ‘దిమాగి నక్సల్స్’ వంటి పదాలను ఉపయోగించడం ప్రశ్నించే గొంతులను అణచివేసే ప్రయత్నమని షర్మిల ఆరోపించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారి స్వేచ్ఛను హరించేందుకు కుట్ర జరుగుతోందని విమర్శించారు. రాజ్యాంగానికి బదులుగా మనుస్మృతిని తీసుకురావాలని, కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. దేశంలో అశాంతి, అరాచకాలకు బీజేపీ విధానాలే కారణమని షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!