

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అద్దంకి మండలం శంఖవరప్పాడు వద్ద ఇద్దరు ఎస్సైల వాహనంలో గంజాయి, మద్యం లభించడాన్ని ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన పోలీసు వ్యవస్థలోనే అక్రమాలు చోటుచేసుకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలని ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. ఈ ఘటన రాష్ట్రంలో వ్యవస్థల పతనానికి నిదర్శనమని ఆరోపించారు.
ఇద్దరు ఎస్సైలు ప్రైవేటు పార్టీలు నిర్వహించారని, అక్కడ మద్యం, గంజాయి వినియోగించారని, పార్టీలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారన్న సమాచారం ఆందోళన కలిగిస్తోందని జగన్ పేర్కొన్నారు. ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులను ఎందుకు సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!