
క్రీడలు

జన శక్తి జనతా దళ్ అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్ ను బిహార్‌లో శనివారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దక్ బంగ్లా చౌరహా సమీపంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. తేజ్ ప్రతాప్ అరెస్ట్ బిహార్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అర్ధరాత్రి తర్వాత విచారణ చేపట్టిన మేజిస్ట్రేట్ తేజ్ ప్రతాప్ యాదవ్‌కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. కోర్టు ఆదేశాల అనంతరం ఆయనను బేయూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ అరెస్ట్‌కు సంబంధించిన కేసు, అభియోగాలపై అధికారుల నుంచి మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!