

ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేలా APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కసరత్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా 8 మందితో రాష్ట్రస్థాయి మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. CWC సభ్యుడు ఎన్. రఘువీరా రెడ్డి కమిటీ చైర్మన్‌గా, మాజీ కేంద్రమంత్రి, APCC వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం కన్వీనర్‌గా నియమితులయ్యారు. CWC సభ్యుడు గిడుగు రుద్రరాజు, మాజీ కేంద్ర మంత్రులు పల్లం రాజు, కిల్లి కృపారాణి కమిటీ సభ్యులుగా ఉన్నారు.
PCC వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, మాజీ రాజ్యసభ ఎంపీ, ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డిని కూడా కమిటీలో సభ్యులుగా నియమించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం PCC కోఆర్డినేషన్, సోషల్ మీడియా ఇన్‌చార్జిగా అధికార ప్రతినిధి, నెల్లూరు DCC అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డిని నియమించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేలా పనిచేయాలని మానిటరింగ్ కమిటీకి వైఎస్ షర్మిలా రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల విధివిధానాలు, అభ్యర్థుల ఎంపికతో పాటు ఇతర అంశాల్లో మానిటరింగ్ కమిటీతో సమన్వయం చేసుకోవాలని జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులను ఆదేశించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!