
జనరల్

జీవీఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ 111వ వార్డులో కూటమి కార్పొరేటర్ అభ్యర్థి పలకా యశోద రవి తరఫున విస్తృత ప్రచారం నిర్వహించారు. విజయరామరాజుపేటతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆమెతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. స్థానిక సమస్యలు, ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు వంటి అంశాలపై ప్రజలతో మాట్లాడారు.
ఈ సందర్భంగా పలకా యశోద రవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కొణతాల రామకృష్ణ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి వారి విజయానికి సహకరించాలని కోరారు. 111వ వార్డులోని వివిధ వీధుల్లో సాగిన ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజలను నేరుగా కలిసి మద్దతు కోరారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!