

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు మరో రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. శివసేన (యూబీటీ)కు చెందిన ఆరుగురు రెబెల్ లోక్‌సభ ఎంపీలను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనం చేస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. దీంతో ఆరుగురు ఎంపీలు అధికారికంగా షిండే వర్గం సభ్యులుగా గుర్తింపు పొందగా, లోక్‌సభలో షిండే వర్గం బలం 13కు పెరిగింది. అదే సమయంలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం సభ్యుల సంఖ్య మూడుకు తగ్గిపోయింది.
ఆరుగురు రెబెల్ ఎంపీలు తమను షిండే వర్గం సభ్యులుగా గుర్తించాలని స్పీకర్‌ను కోరగా, ఉద్ధవ్ వర్గం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేసింది. అయితే పార్లమెంటరీ పార్టీకి చెందిన మూడింట రెండొంతుల మంది షిండే వర్గంలో చేరినందున పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని స్పీకర్ నిర్ణయించారు. ఎన్డీఏ కూటమిలో భాగమైన షిండే శివసేన బలం పెరగడం ప్రస్తుత రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!