
సినిమాలు

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కోల్‌కతాలోని ప్రసిద్ధ కాళీమాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాళీమాతను దర్శించుకున్న లోకేష్ ఆలయ సంప్రదాయాల ప్రకారం పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతలను ఆలయ నిర్వాహకులు ఆయనకు వివరించారు.
దర్శనం అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, శక్తి స్వరూపిణి కాళీమాతను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్ర శ్రేయస్సు, ప్రజల సంక్షేమం కోసం దైవ ఆశీస్సులు కోరినట్లు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!