
గాసిప్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల విజయ్, భాష్యం రమేష్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నూతన ఎంపీలు తమ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎన్నికల ధృవీకరణ పత్రాలను అందుకున్న విజయ్, రమేష్ అనంతరం చంద్రబాబు నాయుడు ఆశీస్సులు తీసుకున్నారు. ఏకగ్రీవ ఎన్నికకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి, పెద్దల సభలో రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. ప్రజా సమస్యలను సమర్థవంతంగా ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడాలని వారికి ఆకాంక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!