
జనరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లోని మణికొండలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆత్మను అర్థం చేసుకున్న వ్యక్తిగా, ఈ నేల తనకు స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ ఆకాంక్షలు, పోరాటాల నుంచే జనసేన ప్రయాణం ప్రారంభమైందని చెప్పారు.

జనసేనను “ప్రజల పార్టీ”గా నిలబెట్టాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తెలంగాణలో “జనవాణి” కార్యక్రమాన్ని విస్తరించి ప్రజల సమస్యలను నేరుగా వినాలని సూచించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజా ఉద్యమాల దిశగా ఆలోచిస్తామని ఆయన తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!