
జనరల్

ప్రభుత్వ రంగ ముడి ఇనుప ఖనిజ ఉత్పత్తి సంస్థ ఎన్ఎండీసీ బొగ్గు ఉత్పత్తి రంగంలోకి ప్రవేశిస్తోంది. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఝార్ఖండ్‌లోని టోకిసూద్ నార్త్ కోల్ గని నుంచి థర్మల్ కోల్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని కంపెనీ చైర్మన్, ఎండీ అమితవ్ ముఖర్జీ తెలిపారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ఉపయోగించే ఈ బొగ్గును వివిధ విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేయనున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ గని నుంచి ఉత్పత్తి చేసే థర్మల్ కోల్లో 10 లక్షల టన్నులను వివిధ విద్యుత్ కేంద్రాలకు విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖర్జీ తెలిపారు. ముడి ఇనుప ఖనిజ రంగానికి పరిమితమైన సంస్థగా ఉన్న ఎన్ఎండీసీ తాజాగా బొగ్గు రంగంలోకి అడుగుపెట్టడం ద్వారా తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!