
జనరల్

పాకిస్థాన్ క్రికెట్‌లో వివాదాలు మరింత ముదురుతున్నాయి. ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో టెస్టుకు ముందు పాక్ క్రికెటర్ల ఫోన్లను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్వాధీనం చేసుకున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. ఆటగాళ్ల ఫోన్లను బోర్డు కస్టడీలోకి తీసుకున్నట్లు పేర్కొన్నప్పటికీ, ఈ చర్యకు కారణం ఏమిటి, ఏ అంశంపై దర్యాప్తు జరుగుతోంది అనే విషయాలపై స్పష్టత లేదు.
ఇప్పటికే జట్టు ఎంపిక, కోచింగ్ సిబ్బంది మార్పులు, ఆటగాళ్లపై చర్యలు వంటి వరుస పరిణామాలతో పాక్ క్రికెట్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఫోన్లను పీసీబీ స్వాధీనం చేసుకుందన్న వార్తలు మరింత కలకలం రేపుతున్నాయి. దీనిపై పీసీబీ అధికారికంగా స్పందించలేదు. మూడో టెస్టుకు ముందే ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!