
జనరల్

భారత ఫుట్‌బాల్ పురుషుల జట్టు 20 ఏళ్ల తర్వాత ఏఎఫ్‌సీ అండర్-20 ఆసియా కప్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. ఆదివారం జరిగిన గ్రూప్-బి చివరి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో భారత్ 3-0తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఆరు పాయింట్లు సాధించిన భారత్ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచి ప్రధాన టోర్నీకి బెర్త్ దక్కించుకుంది.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో డ్యానీ మెయితెయ్ లైశ్రమ్ 25వ నిమిషంలో తొలి గోల్ చేయగా, విశాల్ యాదవ్ 60వ నిమిషంలో ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. ప్రత్యామ్నాయ ఆటగాడిగా వచ్చిన ఎండీ అర్బాష్ 79వ నిమిషంలో మూడో గోల్ చేసి భారత్ విజయాన్ని ఖరారు చేశాడు. భారత్ చివరిసారిగా 2006లో ఏఎఫ్‌సీ అండర్-20 ఆసియా కప్ ప్రధాన టోర్నీలో ఆడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!