
జనరల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సెప్టెంబర్ 3న ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం.
ఈ సమావేశాల్లో తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వివాదంపైనా ఏఐసీసీ నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ వ్యవహారాలకు సంబంధించిన ఇతర అంశాలపైనా కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలు జరిగే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటన అనంతరం ఈ అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!