
రాజకీయాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా వ్యాఖ్యానిస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ దావత్‌కు పిలిస్తే శుభాకాంక్షలు చెబుతానని, అయితే ఆయన ఇచ్చే దావత్‌పై తనకు అనుమానం ఉంటుందని చమత్కరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించిన ధర్నా చౌక్‌లోనే కేటీఆర్ నిరసన చేపట్టడం రాజకీయంగా ఆసక్తికర పరిణామమని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ధర్నా చౌక్‌ను తొలగించిందని, దానిని కొనసాగించాలని అప్పట్లో కాంగ్రెస్ డిమాండ్ చేసిందని సీఎం గుర్తుచేశారు. శాంతియుతంగా నిరసనలు చేపడితే ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అలాగే, హైడ్రా ద్వారా కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు రక్షించబడ్డాయని పేర్కొంటూ, ఆ సంస్థ అవసరం ప్రజలకు ఇప్పుడు స్పష్టమైందని అన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!