
సినిమాలు

కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి అమలు చేయాలనుకుంటున్న వీబీజీ రాంజీ స్కీంపై తెలంగాణ ప్రభుత్వం నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తమ అభ్యంతరాలను వెల్లడిస్తూ కేంద్రానికి లేఖ రాయాలని మంత్రి సీతక్క నిర్ణయించారు. ఇప్పటికే ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించబడింది.
కేంద్రం ఒత్తిడి నేపథ్యంలో ఈ పథకం అమలు తప్పనిసరిగా మారే పరిస్థితులు ఉన్నాయని అధికారులు సూచించారు. ఉపాధి హామీ నిధుల్లో కనీసం 60 శాతం కేంద్రం నుంచే రావాల్సి ఉంటుందని తెలిపారు. ప్రజాభవన్లో జరిగిన సమీక్షలో ప్రత్యేక సీఎస్ దివ్య దేవరాజన్ సహా పలువురు అధికారులతో చర్చించారు. తుది నిర్ణయం కేబినెట్ సమావేశంలో తీసుకుంటామని మంత్రి సీతక్క వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!