

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలపై ‘రెజీమ్ చేంజ్’ అనే కొత్త పుస్తకం ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రముఖ రచయితలు మ్యాగీ హాబర్‌మాన్, జొనాథన్ స్వాన్ రచించిన ఈ పుస్తకం ప్రకారం, ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన పది రోజుల తర్వాత ఓవల్ ఆఫీస్‌లో జరిగిన కీలక సమావేశంలో ప్రత్యేక రాయబారి కీత్ కెలాగ్ యుద్ధ విరమణ కోసం విదేశీ శాంతి పరిరక్షణ దళాలను వినియోగించే ప్రణాళికను ప్రతిపాదించారు.
ఫ్రాన్స్, బ్రిటన్, నెదర్లాండ్స్ వంటి దేశాల బలగాలను పంపే అంశంపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. నాటో దేశాల బలగాలు ఉక్రెయిన్‌లోకి వెళ్తే రష్యా మరింత ఆగ్రహించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో భారత్, సౌదీ అరేబియా వంటి దేశాల బలగాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అయితే భారత్ ఎప్పటికీ అలాంటి ప్రతిపాదనకు అంగీకరించదని, ప్రధాని మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ భారత్ ఇలాంటి వివాదాల్లో జోక్యం చేసుకోదని ట్రంప్ స్పష్టం చేసినట్లు పుస్తకం వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!