
సినిమాలు

ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీ నుంచి విడిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్న ఆరుగురు ఎంపీలను అనుమతించవద్దని పార్టీ నాయకత్వం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరింది. ఈ మేరకు సంజయ్ రౌత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఢిల్లీలో స్పీకర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది.
ఇటీవల నిర్వహించిన శివసేన (యూబీటీ) పార్లమెంటరీ పార్టీ సమావేశానికి విప్ జారీ చేసినప్పటికీ ఆరుగురు ఎంపీలు హాజరుకాలేదు. దీంతో పార్టీ నాయకత్వం వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై స్పందించిన సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారికి రాజకీయ పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ పరిణామాలతో మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!