

ఫిఫా ప్రపంచకప్ సందర్భంగా ఇరాన్ జట్టుపై అమలు చేస్తున్న రవాణా ఆంక్షల విషయంలో అమెరికా తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. తమపై వివక్ష చూపుతున్నారని ఇరాన్ ఆరోపిస్తూ ఫిఫాకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినప్పటికీ, అమెరికా అధికారులు మాత్రం ఆంక్షలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆండ్రూ గిలియాని ఈ చర్యలు పూర్తిగా లాజిస్టిక్ అవసరాల దృష్ట్యా తీసుకున్నవేనని పేర్కొన్నారు.
తమ మ్యాచ్లు ముగిసిన అనంతరం అమెరికాను వీడాలన్న ఆదేశాలపై ఇరాన్ కోచ్, కెప్టెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది తమపై జరుగుతున్న వివక్షగా అభివర్ణిస్తూ ఫిఫా దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అయితే అమెరికా మాత్రం ప్రస్తుత ప్రణాళికలో ఎలాంటి మార్పులు లేవని, బెల్జియంతో మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరాన్ జట్టును అమెరికా వెలుపలకు తరలించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయని వెల్లడించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!