

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ కాంట్రాక్టర్ల నుంచి రూ.1,400 కోట్ల ముడుపులు అందుకున్నారనే ఆరోపణలపై తన వాటా ఎంతో హరీశ్ రావు ప్రజలకు చెప్పాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టిన ఆయన, వాస్తవాలను పక్కనబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హరీశ్ రావుకు సూచించారు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతినడం బీఆర్‌ఎస్ పాలన వైఫల్యమని విమర్శించారు.
తెలంగాణ ప్రయోజనాల విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి సాంకేతిక అనుమతులు, 67 టీఎంసీల నీటి కేటాయింపులు సాధించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందన్నారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పలుమార్లు కేంద్రానికి, సంబంధిత అధికారులకు లేఖలు రాసినట్లు తెలిపారు. రాష్ట్ర నీటి హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!