7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రజా సమస్యలపై పోరాటానికి కొత్త పార్టీ అవసరం - విజయసాయిరెడ్డి

Writer: Pooja 03:53 PM, 7 సెప్టెంబర్, 2026
ప్రజా సమస్యలపై పోరాటానికి కొత్త పార్టీ అవసరం - విజయసాయిరెడ్డి

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సమస్యలపై సమర్థంగా పోరాడేందుకు కొత్త రాజకీయ పార్టీ అవసరమని అన్నారు. గత 15 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాలు టీడీపీ, వైసీపీ చుట్టూనే తిరుగుతున్నాయని, ఈ రెండు పార్టీల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రెండు పార్టీలు విఫలమయ్యాయని ఆరోపిస్తూ, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ప్రభుత్వ ఖర్చులు, ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రాష్ట్ర అప్పులపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన లెక్కలు వెల్లడించాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిధులను దుబారా చేయకుండా ప్రైవేట్ పెట్టుబడులను పెద్దఎత్తున ఆకర్షించాలని సూచించారు. పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని తగ్గించాలని, సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి సమగ్ర ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

తమ పార్టీ అధికారంలోకి వస్తే యువతకు రాజకీయాల్లో విస్తృత అవకాశాలు కల్పిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. ముఖ్యంగా జెన్‌-జీ యువతకు ప్రాధాన్యం ఇస్తామని, పార్టీ పదవులు, అవకాశాల్లో 66 శాతం యువతకు కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు సౌర విద్యుత్‌ను వినియోగించుకోవాలని సూచించారు. ఉపాధి, విద్యారంగంలో సమస్యలను పరిష్కరించాలని, ఏపీపీఎస్సీ, డీఎస్సీ వ్యవహారాలపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

విజయదశమి తర్వాతి రోజే కొత్త పార్టీ వివరాలను ప్రకటిస్తానని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అంతకుముందు అనంతపురం, విశాఖపట్నం, తిరుపతిలో మరో నాలుగు ప్రెస్‌మీట్లు నిర్వహిస్తానని చెప్పారు. అనంతరం కాంక్లేవ్‌ నిర్వహించి పార్టీ పేరు, జెండా, అజెండాను ప్రకటిస్తానన్నారు. తమది ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన ప్రాంతీయ పార్టీ అని స్పష్టం చేసిన ఆయన, యువతతో కలిసి పార్టీని స్థాపిస్తానని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీఆర్ఎస్ నేత తాతా మధు వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి సీరియస్

బీఆర్ఎస్ నేత తాతా మధు వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి సీరియస్

కేసీఆర్ ఫామ్‌హౌస్ రాజకీయాలపై సీతక్క ఫైర్

కేసీఆర్ ఫామ్‌హౌస్ రాజకీయాలపై సీతక్క ఫైర్

 ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

22ఏ అంశంపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్ధం: శ్రీధర్ బాబు

22ఏ అంశంపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్ధం: శ్రీధర్ బాబు

భూ దందాలపై విచారణకు బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్

భూ దందాలపై విచారణకు బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్

అసెంబ్లీ సమావేశాలకు కొండా సురేఖ దూరం..

అసెంబ్లీ సమావేశాలకు కొండా సురేఖ దూరం..

ట్యాగ్లు
విజయసాయిరెడ్డిఆంధ్రప్రదేశ్ రాజకీయాలుకొత్త రాజకీయ పార్టీఏపీ పాలిటిక్స్యువత రాజకీయాలురాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
షఫాలీ సెండ్‌ఆఫ్‌పై ఫాతిమాకు ఐసీసీ షాక్
క్రీడలు

షఫాలీ సెండ్‌ఆఫ్‌పై ఫాతిమాకు ఐసీసీ షాక్

ఏపీ డీఎస్సీని కుదిపేస్తున్న నకిలీ సర్టిఫికెట్ల వివాదం
జనరల్

ఏపీ డీఎస్సీని కుదిపేస్తున్న నకిలీ సర్టిఫికెట్ల వివాదం

పదవి కోసమే రాజగోపాల్ వైఖరి మారిందా?  - కొండా సురేఖ
రాజకీయాలు

పదవి కోసమే రాజగోపాల్ వైఖరి మారిందా? - కొండా సురేఖ

ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ ఎంపీల కీలక సమావేశం
జనరల్

ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ ఎంపీల కీలక సమావేశం

నాని, కీర్తి సురేశ్‌ క్రాస్‌ఓవర్‌ వీడియోకు అదిరే రెస్పాన్స్‌
సినిమాలు

నాని, కీర్తి సురేశ్‌ క్రాస్‌ఓవర్‌ వీడియోకు అదిరే రెస్పాన్స్‌

సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ ఎంట్రీ.. డేరింగ్ ఆటతో దూసుకెళ్తుందా?
షోస్

సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ ఎంట్రీ.. డేరింగ్ ఆటతో దూసుకెళ్తుందా?

మరోసారి ‘బిగ్ బాస్ బజ్’ హోస్ట్‌గా శివాజీ...
షోస్

మరోసారి ‘బిగ్ బాస్ బజ్’ హోస్ట్‌గా శివాజీ...

ప్రజా సమస్యలపై పోరాటానికి కొత్త పార్టీ అవసరం - విజయసాయిరెడ్డి
రాజకీయాలు

ప్రజా సమస్యలపై పోరాటానికి కొత్త పార్టీ అవసరం - విజయసాయిరెడ్డి

మారుతీ కార్ల ధరలకు మళ్లీ షాక్‌
బిజినెస్

మారుతీ కార్ల ధరలకు మళ్లీ షాక్‌

అగ్నిపరీక్ష కంటెస్టెంట్ రాజకుమారి ఎమోషనల్ జర్నీ..
షోస్

అగ్నిపరీక్ష కంటెస్టెంట్ రాజకుమారి ఎమోషనల్ జర్నీ..

పీసీబీ విచారణ వెనుక అసలు కారణమేంటి?
క్రీడలు

పీసీబీ విచారణ వెనుక అసలు కారణమేంటి?

బీఆర్ఎస్ నేత తాతా మధు వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి సీరియస్
రాజకీయాలు

బీఆర్ఎస్ నేత తాతా మధు వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి సీరియస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!