

అసెంబ్లీలో స్పీకర్‌పై బీఆర్ఎస్ నేత తాతా మధు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేత కేసీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని, సంబంధిత సభ్యుడిని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో చర్చల తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామని, బీజేపీ లేవనెత్తిన అంశాలపై కూడా సభలో చర్చ జరుగుతుందని చెప్పారు. సభా సంప్రదాయాలను ప్రతి సభ్యుడు కాపాడాలని సీఎం సూచించారు.
సభ సజావుగా సాగడంతో పాటు సభ్యుల గౌరవం, హక్కులకు భంగం కలగకుండా స్పీకర్ వ్యవహరిస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు. అందరం కలిసి స్పీకర్‌ను సభాపతిగా ఎన్నుకున్నందున ఆయన గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. స్పీకర్‌పై అత్యంత అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తే వాటిపై ముందుగా చర్చ జరగాలని, ఆ తర్వాతే ఇతర అంశాలపై మాట్లాడాలని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేలా ప్రోత్సహించారని ఆరోపించిన సీఎం దళితులు, గిరిజనులు, సమాజాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గతంలో దళిత నాయకుల విషయంలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరును కూడా ఆయన ప్రస్తావించారు. ఈ చర్చలో బీజేపీ పాల్గొనాలని, సభా గౌరవాన్ని కాపాడేందుకు సభ్యులంతా కలిసి పనిచేయాలని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!