

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 తొలి రోజు నుంచే హౌస్‌లో హీట్ పెంచుతోంది. సాధారణంగా తొలి వారంలో కంటెస్టెంట్లు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ తమ గేమ్‌ను నెమ్మదిగా ప్రారంభిస్తారు. కానీ ఈసారి మాత్రం మొదటి రోజు నుంచే టాస్కులు, వాగ్వాదాలు, గ్రూపులు, ఎమోషన్స్‌తో హౌస్‌లో హైడ్రామా కనిపిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ‘మహా పరీక్ష’ టాస్క్ ఈ ఉత్కంఠను మరింత పెంచింది.
ఈ టాస్క్‌లో రెడ్, బ్లూ టీమ్స్ మధ్య పోటీ జరుగుతుండగా.. కంటెస్టెంట్ల ఆటతీరును బట్టి వారిని హై రిస్క్ జోన్లోకి పంపిస్తున్నారు. ఇందులో భాగంగా బ్లూ టీమ్ నుంచి ఆటో రామ్ ప్రసాద్, మరో టీమ్ నుంచి ఆర్జే చరణ్ హై రిస్క్ జోన్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ జోన్లో ఉన్న వారికి ఎప్పుడైనా ఎలిమినేషన్ ముప్పు ఉండొచ్చని బిగ్‌బాస్ ప్రకటించడంతో హౌస్‌లో టెన్షన్ నెలకొంది.
ఇక రామ్ ప్రసాద్ ఇప్పటికే టాస్కుల్లో చురుగ్గా పాల్గొంటూ, తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు చరణ్‌కు కూడా పూర్తిగా ప్రేక్షకుల మద్దతు లేదని చెప్పలేం. అయితే గేమ్‌లో పెద్దగా యాక్టివ్‌గా కనిపించకపోవడం అతనికి ప్రతికూలంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారం మరింత ఉత్కంఠను పెంచుతోంది. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం బిగ్‌బాస్ 10లో తొలి ఎలిమినేట్ చరణ్‌నే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మూడు రోజుల్లోనే ఆయన హౌస్ నుంచి బయటకు వచ్చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. అదే నిజమైతే, ఇంత తక్కువ సమయంలో ఎలిమినేషన్ కావడం షో చరిత్రలోనే అరుదైన పరిణామంగా నిలిచే అవకాశం ఉంది. చరణ్‌కు గేమ్‌లో తనను తాను నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండానే బయటకు పంపడం అన్యాయమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!