15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రైల్వేలో భారత్‌ సరికొత్త రికార్డు...

Writer: Chandrika 10:24 AM, 15 సెప్టెంబర్, 2026
రైల్వేలో భారత్‌ సరికొత్త రికార్డు...

సరకు రవాణా రంగంలో భారత రైల్వే కీలక మైలురాయిని సాధించింది. డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ (DFC) నెట్‌వర్క్‌ను పూర్తి చేయడంతో దేశంలో సరకు రవాణాకు ప్రత్యేకమైన, వేగవంతమైన మార్గం అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా వెస్ట్రన్‌ డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ను ప్రపంచంలోనే తొలి పూర్తి ఎలక్ట్రిఫైడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌గా పేర్కొంటున్నారు. ఇందులో డబుల్‌ స్టాక్‌ కంటైనర్‌ రైళ్లను నడిపేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అమెరికా, కెనడా వంటి దేశాల్లో డబుల్‌ స్టాక్‌ రైళ్లు నడుస్తున్నప్పటికీ.. భారత్‌లో పూర్తిగా విద్యుదీకరించిన మార్గంలో ఇలాంటి భారీ సరకు రవాణా నిర్వహించడం ప్రత్యేకతగా నిలిచింది. వేగవంతమైన సరకు రవాణా కోసం భారత ప్రభుత్వం 2006లో డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (DFCCIL)ను ఏర్పాటు చేసింది.

ఈస్టర్న్‌ డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ 1,337 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా.. వెస్ట్రన్‌ డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ పొడవు 1,506 కిలోమీటర్లు. వెస్ట్రన్‌ కారిడార్‌లోని చివరి 326 కిలోమీటర్ల సెక్షన్లు అందుబాటులోకి రావడంతో మొత్తం DFC నెట్‌వర్క్‌ పొడవు 2,843 కిలోమీటర్లకు చేరింది. సుమారు 7.45 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసిన ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ వైర్ల కారణంగా ఒకదానిపై మరొకటి రెండు కంటైనర్లను రవాణా చేసే వీలుంది. దీంతో ఒక్కో రైలులో ఎక్కువ సరకు తరలించవచ్చు. ఇంధన వినియోగం, ఉద్గారాలు తగ్గడంతో పాటు సాధారణ రైలు మార్గాల్లో ప్యాసింజర్‌ రైళ్ల రాకపోకలకు ఏర్పడే అంతరాయాలు కూడా తగ్గనున్నాయి. డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్లు దేశ వాణిజ్యం, లాజిస్టిక్స్‌ వ్యవస్థకు వెన్నెముకగా మారుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గతంలో సరకు రైలు 100 కిలోమీటర్లు ప్రయాణించేందుకు సుమారు 6.5 గంటలు పట్టేదని.. ఇప్పుడు అంతకంటే సగం కంటే తక్కువ సమయంలోనే ఆ దూరాన్ని చేరుకునే అవకాశం ఉందని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒరాకిల్‌లో మళ్లీ ‘6AM’ లేఆఫ్స్‌ మెయిల్స్‌..

ఒరాకిల్‌లో మళ్లీ ‘6AM’ లేఆఫ్స్‌ మెయిల్స్‌..

యూపీఐ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్

యూపీఐ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్

ఎన్‌ఎస్‌ఈ  ఐపీఓకు రంగం సిద్ధం..

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు రంగం సిద్ధం..

  నేటి ఇంధన ధరలపై తాజా అప్‌డేట్‌

నేటి ఇంధన ధరలపై తాజా అప్‌డేట్‌

నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

పీఎఫ్‌ సమాచారానికి ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం

పీఎఫ్‌ సమాచారానికి ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం

ట్యాగ్లు
భారత రైల్వేడెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌DFCవెస్ట్రన్‌ ఫ్రైట్‌ కారిడార్‌ఈస్టర్న్‌ ఫ్రైట్‌ కారిడార్‌డబుల్‌ స్టాక్‌ రైళ్లుఎలక్ట్రిక్‌ ఫ్రైట్‌ కారిడార్‌భారత లాజిస్టిక్స్‌సరకు రవాణారైల్వే మౌలిక సదుపాయాలునరేంద్ర మోదీDFCCIL
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మూవీ లవర్స్‌కు పండగే.. థియేటర్, ఓటీటీలో ఈ వారం భారీగా రిలీజ్‌లు
సినిమాలు

మూవీ లవర్స్‌కు పండగే.. థియేటర్, ఓటీటీలో ఈ వారం భారీగా రిలీజ్‌లు

టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌
సినిమాలు

టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్
జనరల్

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...

బిగ్ బాస్ తెలుగు 10: ఐదో రోజే చైత్ర రాయ్ ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఐదో రోజే చైత్ర రాయ్ ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ తెలుగు 10:రెండో వారం నామినేషన్స్‌లో భారీ ట్విస్ట్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10:రెండో వారం నామినేషన్స్‌లో భారీ ట్విస్ట్..

చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కేంద్రం–మెటా చర్చలు..
జనరల్

చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కేంద్రం–మెటా చర్చలు..

రైల్వేలో భారత్‌ సరికొత్త రికార్డు...
బిజినెస్

రైల్వేలో భారత్‌ సరికొత్త రికార్డు...

మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు
జనరల్

మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు

ఒరాకిల్‌లో మళ్లీ ‘6AM’ లేఆఫ్స్‌ మెయిల్స్‌..
బిజినెస్

ఒరాకిల్‌లో మళ్లీ ‘6AM’ లేఆఫ్స్‌ మెయిల్స్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!