

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్‌బాస్’ షో ఇప్పుడు చారిత్రక 10వ సీజన్‌లోకి అడుగుపెడుతోంది. కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ సీజన్‌ను ‘దశావతారం’ అనే సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. లాంచ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో హౌస్‌లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్ల పేర్లతో ఓ జాబితా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గత సీజన్‌లో ‘అగ్నిపరీక్ష’ ద్వారా ఎంపికైన కామనర్ కంటెస్టెంట్ కళ్యాణ్ పడాల టైటిల్ విజేతగా నిలవడంతో ఈసారి కూడా సామాన్యులకు పెద్దపీట వేస్తున్నట్లు సమాచారం. ‘బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2’లో దాదాపు 70 మంది పోటీ పడగా, వారిలో 15 మంది ఫైనల్ లిస్ట్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. అమన్ మసూద్, ఝాన్సీ, శ్రష్టి వ్యాకరణి, అపూర్వ, షాలినీ, చరణ్, రాజకుమారి, భాగీ తుళ్లూరి, రోహిత్ నాయుడు, ప్రియాంక, మిథిలేష్, హేమంత్ యాదవ్, దీపక్ సేనాపతి తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ 15 మందిలో కేవలం ఆరుగురికి మాత్రమే బిగ్‌బాస్ ప్రధాన హౌస్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని సమాచారం. ఈ కంటెస్టెంట్లలో ఎవరు ఫైనల్‌గా హౌస్‌లోకి వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు అధికారిక ప్రకటన వెలువడే వరకు వైరల్‌గా మారిన ఈ జాబితాను ధృవీకరించిన జాబితాగా పరిగణించలేం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!