

బిగ్ బాస్ తెలుగు 10లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన మిథిలేష్ రెడ్డి కేవలం రెండు రోజులకే రూ.15 లక్షల క్యాష్ ఆఫర్ తీసుకుని హౌస్ నుంచి బయటకు రావడం సంచలనంగా మారింది. ఈ నిర్ణయం సోషల్ మీడియాలో, బుల్లితెర వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మిథిలేష్ తన నిర్ణయానికి గల కారణాలను వివరించాడు. వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత టైటిల్ గెలవడం అంత సులభం కాదని ముందుగానే అంచనా వేసినట్లు చెప్పాడు. త్రిగుణ్, ముఖేశ్, రోహిత్ వంటి కంటెస్టెంట్లు టైటిల్ రేసులో బలంగా ఉన్నారని, అలాంటి పరిస్థితుల్లో టాప్ స్థానాలకు చేరుకోవడం కష్టమని భావించినట్లు తెలిపాడు. తన నిర్ణయం పట్ల తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారని, ఈ సంఘటన తన జీవితంలో అరుదైన, గుర్తుండిపోయే సందర్భంగా నిలిచిపోతుందని మిథిలేష్ పేర్కొన్నాడు. భవిష్యత్తులో తన కెరీర్‌కు ‘బిగ్ బాస్ కంటెస్టెంట్’ అనే గుర్తింపు అడ్డంకిగా మారదని, తనకు ఈ నిర్ణయంపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని స్పష్టం చేశాడు.
అగ్నిపరీక్ష టాస్క్‌లో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న మిథిలేష్.. తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదలతో డు ఆర్ డై తరహాలో ఆడానని చెప్పాడు. రూ.15 లక్షల ఆఫర్ రాకపోయి ఉంటే టాప్ 5 కోసం చివరి వరకు పోరాడేవాడినని తెలిపాడు. అదే సమయంలో డబ్బు తీసుకోకుండా హౌస్‌లో కొనసాగితే, తాను కావాలనే బయటకు వెళ్లాలనుకున్నాననే నెగెటివ్ నరేటివ్ ఏర్పడే అవకాశం ఉండేదని వివరించాడు. బయటకు వచ్చిన తర్వాత తనకు ఎక్కువగా పాజిటివ్ స్పందనే లభించిందని చెప్పాడు. అమన్‌తో తనకు జరిగిన విభేదాలు, త్రిగుణ్ తన నిర్ణయాన్ని ఆపేందుకు ప్రయత్నించడం, ముఖేశ్ చేసిన వ్యాఖ్యలపై కూడా మిథిలేష్ స్పందించాడు. కొన్ని సందర్భాల్లో జరిగిన వ్యాఖ్యలు ఆటకు సంబంధించినవిగా కాకుండా వ్యక్తిగతంగా అనిపించాయని పేర్కొన్నాడు. బిగ్ బాస్ టీమ్ కూడా తన నిర్ణయాన్ని ప్రత్యేకంగా గుర్తించిందని చెప్పాడు. మొత్తం ప్రైజ్‌మనీలో గణనీయమైన మొత్తమైన రూ.15 లక్షల ఆఫర్ తనకు సరైన అవకాశంగా అనిపించిందని, అందుకే దాన్ని అంగీకరించి హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు మిథిలేష్ వివరించాడు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!