

బిగ్ బాస్ తెలుగు 10 ప్రారంభానికి ముందే ‘అగ్ని పరీక్ష’ ఆడిషన్స్ వివాదాస్పదంగా మారాయి. సామాన్యులను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించేందుకు నిర్వహిస్తున్న ఈ ప్రక్రియలో వందలాది మందిలోంచి 15 మందిని ఫైనలిస్టులుగా ఎంపిక చేసి, వారిలో ఐదారుగురిని తుది కంటెస్టెంట్లుగా ఎంపిక చేయనున్నారు. ఆగస్టు 15 నుంచి ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, మాజీ కంటెస్టెంట్లు నవదీప్, బిందు మాధవి, అభిజిత్‌లు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.
ఆడిషన్స్‌లో ఫైనల్ స్టేజ్ వరకు వెళ్లిన ఉప్పల్ బాలు జడ్జీల నిర్ణయంతో రిజెక్ట్ అయ్యాడు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన బాలు సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసి నవదీప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. తన వీడియోలు వల్గర్‌గా ఉంటాయని చెప్పి టాస్క్ కూడా ఇవ్వకుండా రిజెక్ట్ చేశారని ఆరోపించాడు. తనను చిన్నచూపు చూడొద్దని, నవదీప్‌కు తన శాపం తగులుతుందని వ్యాఖ్యానించాడు. బాలు వీడియో వైరల్ కావడంతో ‘అగ్ని పరీక్ష’పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!