
జనరల్

ముక్కోణపు సిరీస్ ఫైనల్‌లో నేడు భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టి ఉంది. గత లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక సూపర్ ఓవర్లో భారత్‌పై విజయం సాధించింది.
ఆ మ్యాచ్ అనంతరం శ్రీలంక ఆటగాడు విషెన్ హలంబాగె చేసిన వ్యాఖ్యలతో వైభవ్ ఉద్రిక్తతకు లోనయ్యాడు. ఈ ఘటనపై కెప్టెన్ తిలక్ వర్మ స్పందిస్తూ మైదానంలో భావోద్వేగాలు సహజమని, వైభవ్ ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. అతడికి పూర్తి మద్దతు ఉంటుందని, తన సహజ ఆటతో స్వేచ్ఛగా ఆడాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!