
రాజకీయాలు

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) 'మీ ఓటే మీ సూపర్ పవర్' అనే నినాదంతో వినూత్న ఓటరు చైతన్య కార్యక్రమాన్ని చేపట్టనుంది. స్పైడర్-మ్యాన్ సినిమాలోని "గొప్ప శక్తితో పాటు గొప్ప బాధ్యత కూడా వస్తుంది" అనే ప్రసిద్ధ సందేశాన్ని ఆధారంగా తీసుకుని ఓటు హక్కు విలువను ప్రజలకు గుర్తు చేయనుంది. ప్రతి ఓటు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే శక్తిగా నిలుస్తుందని ఈసీఐ పేర్కొంది.
ఈ ప్రచారంలో భాగంగా ఓటర్ల జాబితాలో పేరు నమోదు, వివరాల ధృవీకరణ, సవరణ లేదా నవీకరణను ECINet ద్వారా ఎప్పుడైనా చేసుకోవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. యువతతో పాటు ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఓటరు జాబితాలో తన వివరాలు సరిచూసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావాలని ఈసీఐ పిలుపునిచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!