
రాజకీయాలు

‘శంబాల’ ఫేమ్ దర్శకుడు యుగంధర్ ముని దర్శకత్వంలో హీరో సందీప్ కిషన్ నటిస్తున్న భారీ చిత్రం ‘కరికాల’. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. గుర్రంపై ఖడ్గంతో రాజసంగా కనిపించిన సందీప్ కిషన్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
‘కరికాల’ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మొదటి చాప్టర్ 2027 జూలై 2న, రెండో చాప్టర్ 2027 అక్టోబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి. భారీ విజువల్స్, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!