

అండర్-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ జావెలిన్ త్రోయర్ ఆశిష్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో రజత పతకం సాధించాడు. 19 ఏళ్ల ఆశిష్ 74.09 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. దాదాపు పదేళ్ల తర్వాత అండర్-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్ జావెలిన్ త్రోలో భారత్‌కు మరో పతకం లభించింది. 2016లో నీరజ్ చోప్రా 86.48 మీటర్ల త్రోతో స్వర్ణం సాధించి భారత్‌కు ఈ విభాగంలో తొలి పతకాన్ని అందించాడు.
ఫైనల్‌లో ఆశిష్‌కు ఆది నుంచే గట్టి పోటీ ఎదురైంది. తొలి ప్రయత్నంలో 69.96 మీటర్లు విసిరిన అతడు మూడో ప్రయత్నంలో 74.09 మీటర్లతో తన సీజన్ బెస్ట్ నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాకు చెందిన జాన్ హైడ్రిక్ హైమన్స్ 80.50 మీటర్ల త్రోతో స్వర్ణం సాధించగా, డొమినికాకు చెందిన అడ్డిసన్ జేమ్స్ 73.89 మీటర్లతో కాంస్యం దక్కించుకున్నాడు. ఈ విజయంతో ఆశిష్ అండర్-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్ జావెలిన్ త్రోలో పతకం సాధించిన రెండో భారత అథ్లెట్‌గా నిలిచాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!