

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (WAPL) తొలి సీజన్‌ను అమరావతి ఈ ఛాంపియన్స్ ఘన విజయంతో ప్రారంభించింది. మంగళగిరిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో వైజాగ్ ఫైర్ బర్డ్స్‌పై 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అమరావతి 20 ఓవర్లలో 4 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఓపెనర్ పరస రంగలక్ష్మి 74 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 102 పరుగుల అద్భుత శతకం సాధించింది. కాట్రగడ్డ ధనలక్ష్మి 30 బంతుల్లో 43 పరుగులతో ఆమెకు మంచి సహకారం అందించింది. లక్ష్య ఛేదనలో వైజాగ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 146 పరుగులకే పరిమితమైంది. ఉరుకూటి పుష్పలత 43 బంతుల్లో 60 పరుగులతో పోరాడినా జట్టుకు విజయం అందించలేకపోయింది. ఆయేషా సింగ్ 35, అంజలి శ్రావణి 24 పరుగులు చేశారు. అమరావతి బౌలర్లలో కండ్రేగుల దేవిక, అంకం విష్ణుప్రియ, తరుణి జోషి వికెట్లు తీశారు.
తొలి మ్యాచ్‌లో రాయలసీమ జెన్ స్టార్స్ 7 వికెట్ల తేడాతో గోదావరి గోల్డెన్ ఈగల్స్‌పై విజయం సాధించింది. తొలుత గోదావరి 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు చేయగా, హెర్నీటా ఫ్లవియా పెరీరా 63 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. అనంతరం రాయలసీమ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వేములపాటి సేతుసాయి, ఎల్లుట్ల పద్మజ కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన పద్మజ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది. తొలి WAPL సీజన్‌లో నాలుగు జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!