24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..

Writer: Chandrika 12:45 PM, 10 ఆగస్టు, 2026
హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..

ప్రపంచ అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత యువ అథ్లెట్లు చరిత్రాత్మక ప్రదర్శన చేశారు. పురుషుల హైజంప్‌లో 19 ఏళ్ల బసంత్‌ కుమార్‌ మేఘ్వాల్‌ 2.21 మీటర్ల ఎత్తు దూకి రజత పతకాన్ని సాధించాడు. ఈ టోర్నీ చరిత్రలో హైజంప్‌లో భారత్‌కు పతకం అందించిన తొలి అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. అల్జీరియాకు చెందిన యూన్స్‌ అయాచి 2.21 మీటర్లతో స్వర్ణం, బ్రిటన్‌కు చెందిన ఓటిస్‌ పూల్‌ కాంస్యం గెలిచారు. ముగ్గురూ 2.24 మీటర్లను దాటలేకపోయారు. గతంలో బసంత్‌ అత్యుత్తమ ప్రదర్శన 2.11 మీటర్లు కాగా.. మాజీ జాతీయ రికార్డు హైజంపర్‌ సహానా కుమారి మార్గదర్శకత్వంలో 2.21 మీటర్లకు మెరుగుపడ్డాడు.

లాంగ్‌జంప్‌లోనూ భారత్‌కు మరో పతకం దక్కింది. 18 ఏళ్ల షానవాజ్‌ ఖాన్‌ మూడో ప్రయత్నంలో 7.84 మీటర్ల దూరం దూకి కాంస్య పతకాన్ని సాధించాడు. ఇటలీకి చెందిన డానియెల్‌ ఇంజోలి 7.97 మీటర్లతో స్వర్ణం, ఆస్ట్రేలియాకు చెందిన మెక్‌గ్రాడర్‌ 7.96 మీటర్లతో రజతం గెలిచారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన షానవాజ్‌ కష్టాలను అధిగమించి అథ్లెటిక్స్‌లో రాణిస్తున్నాడు. 2028 లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనడం తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. మరోవైపు భారత మహిళల 4×400 మీటర్ల రిలే జట్టు ఫైనల్‌కు అర్హత సాధించింది. మహిళల 4×100 మీటర్లు, పురుషుల 4×400 మీటర్ల రిలే జట్లు ఫైనల్‌కు చేరలేకపోయాయి. పురుషుల 5,000 మీటర్ల రేస్‌వాక్‌లో నితిన్‌ గుప్తా ఆరో స్థానంలో నిలిచాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ధోనీ కెరీర్‌ను మార్చిన గంగూలీ నిర్ణయం.. బయటపడ్డ ఆసక్తికర కథ

ధోనీ కెరీర్‌ను మార్చిన గంగూలీ నిర్ణయం.. బయటపడ్డ ఆసక్తికర కథ

2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకూ సింగ్

2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకూ సింగ్

కేరళలో విరాట్ కోహ్లీకి ఘన స్వాగతం

కేరళలో విరాట్ కోహ్లీకి ఘన స్వాగతం

ఆసియా క్రీడల్లో భారత్‌కు షూటింగ్‌లో రెండు కాంస్యాలు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు షూటింగ్‌లో రెండు కాంస్యాలు..

భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20 టికెట్ల విక్రయ తేదీ వెల్లడించిన హెచ్‌సీఏ...

భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20 టికెట్ల విక్రయ తేదీ వెల్లడించిన హెచ్‌సీఏ...

ఆసియా క్రీడల్లో భారత ఉషు స్టార్ రోషిబినా దేవి దూకుడు..

ఆసియా క్రీడల్లో భారత ఉషు స్టార్ రోషిబినా దేవి దూకుడు..

ట్యాగ్లు
బసంత్‌ కుమార్‌ మేఘ్వాల్‌ప్రపంచ అండర్‌-20 అథ్లెటిక్స్‌హైజంప్‌భారత అథ్లెటిక్స్‌షానవాజ్‌ ఖాన్‌లాంగ్‌జంప్‌అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌భారత్‌ పతకాలుభారత నేవీ అథ్లెట్‌క్రీడా వార్తలుBasant Kumar Meghwal Makes History With India’s First U20 High Jump Medal
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాల జోరు షురూ
సినిమాలు

రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాల జోరు షురూ

బిగ్‌బాస్‌ ఆఫర్‌పై కుమారి ఆంటీ ఆసక్తికర వ్యాఖ్యలు..
షోస్

బిగ్‌బాస్‌ ఆఫర్‌పై కుమారి ఆంటీ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఏపీ లిక్కర్ స్కామ్ లో కొనసాగుతున్న ఈడీ విచారణ
జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్ లో కొనసాగుతున్న ఈడీ విచారణ

అకృతి చౌదరి నిర్బంధం కేసులో కీలక పరిణామం..
జనరల్

అకృతి చౌదరి నిర్బంధం కేసులో కీలక పరిణామం..

ఓటర్ల జాబితా సవరణపై ఒవైసీ ఫైర్‌..
రాజకీయాలు

ఓటర్ల జాబితా సవరణపై ఒవైసీ ఫైర్‌..

ఎన్నికల సంఘంలో విభేదాలపై మాజీ సీఈసీ ఓపీ రావత్‌ ఏమన్నారంటే?
రాజకీయాలు

ఎన్నికల సంఘంలో విభేదాలపై మాజీ సీఈసీ ఓపీ రావత్‌ ఏమన్నారంటే?

సుప్రీం తీర్పుపై దానం నాగేందర్ కీలక స్పందన.. ఇదే!
రాజకీయాలు

సుప్రీం తీర్పుపై దానం నాగేందర్ కీలక స్పందన.. ఇదే!

ధోనీ కెరీర్‌ను మార్చిన గంగూలీ నిర్ణయం.. బయటపడ్డ ఆసక్తికర కథ
క్రీడలు

ధోనీ కెరీర్‌ను మార్చిన గంగూలీ నిర్ణయం.. బయటపడ్డ ఆసక్తికర కథ

రాత్రికి రాత్రే సెలబ్రిటీ కేఫ్‌గా మారిన ‘ధురంధర్‌’ షూటింగ్‌ స్పాట్‌...
సినిమాలు

రాత్రికి రాత్రే సెలబ్రిటీ కేఫ్‌గా మారిన ‘ధురంధర్‌’ షూటింగ్‌ స్పాట్‌...

జార్జ్‌ క్రిష్‌లో శర్వానంద్‌ కొత్త అవతారం
సినిమాలు

జార్జ్‌ క్రిష్‌లో శర్వానంద్‌ కొత్త అవతారం

స్థానిక ఎన్నికలపై జగన్‌ కీలక దిశానిర్దేశం
జనరల్

స్థానిక ఎన్నికలపై జగన్‌ కీలక దిశానిర్దేశం

ఎస్‌బీఐ కార్డు కొత్త సేవలు.. ఎఫ్‌డీ ఆధారిత సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డులు..
బిజినెస్

ఎస్‌బీఐ కార్డు కొత్త సేవలు.. ఎఫ్‌డీ ఆధారిత సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డులు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!