
సినిమాలు

టీ20 కెప్టెన్సీ చేపట్టిన తర్వాత శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు విజయాన్ని అందుకోలేకపోయారు. ఐర్లాండ్‌తో రెండు, ఇంగ్లాండ్‌తో రెండు మ్యాచ్‌లలో టీమ్ ఇండియా ఓటమి చెందగా, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అతని కెప్టెన్సీపై విమర్శలు పెరుగుతున్నాయి. అయితే, ఈ విమర్శలను అతని సోదరి శ్రేష్ఠ ఖండిస్తూ, ప్రతి క్రీడాకారుడికి ఇలాంటి క్లిష్ట దశ సహజమని పేర్కొన్నారు.
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు కూడా తమ కెరీర్లో పరాజయాలను ఎదుర్కొన్నారని ఆమె గుర్తు చేశారు. శ్రేయస్ అద్భుతమైన ఆటగాడని, త్వరలోనే విజయాలు సాధించి విమర్శకులకు సమాధానం ఇస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ఇంగ్లాండ్‌తో జరిగే నాలుగో టీ20 మ్యాచ్ టీమ్ ఇండియాకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌ను సమం చేసే అవకాశాలు ఉంటాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!