
సినిమాలు

తమిళనాడు సీఎం విజయ్ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్‌ను మంజూరు చేసింది. ఈ సినిమా నిడివి 183 నిమిషాలుగా నిర్ణయించబడింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా, మమిత బైజు, బాబీ దేవోల్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
మొదట ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, సెన్సార్ సమస్యలు, కోర్టు కేసులు కారణంగా వాయిదా పడింది. దీర్ఘకాల ఆలస్యాల తర్వాత ఇప్పుడు విడుదలకు మార్గం సుగమమైంది. జులై 24న విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తోంది. దీనిపై నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!