

భారత్‌లో క్రికెట్‌కు ఉన్న భారీ ఆదరణ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లకు జాతీయ క్రీడా పురస్కారాల్లో తగిన గుర్తింపు దక్కడం లేదంటూ అభిమానులు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శనలు చేస్తూ, కీలక రికార్డులు సాధిస్తున్న క్రికెటర్ల ప్రతిభను అవార్డుల ఎంపిక కమిటీ ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అర్జున అవార్డులతో పాటు దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న విషయంలోనూ ఈ అంశంపై చర్చ జరుగుతోంది.
2024లో నలుగురు క్రీడాకారులకు ఖేల్ రత్న పురస్కారం లభించగా, 2025లో ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఒక్క క్రీడాకారుడు కూడా ఎంపిక కాలేదు. దీంతో జాతీయ క్రీడా పురస్కారాల ఎంపికపై క్రికెట్ అభిమానులతో పాటు ఇతర క్రీడాభిమానుల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. క్రికెటర్ల ప్రదర్శన, రికార్డులను పరిగణనలోకి తీసుకుని అవార్డుల ఎంపిక జరగాలని అభిమానులు కోరుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!