

భారత మహిళల జట్టు టీ20 ప్రపంచకప్ 2026లో లీగ్ దశలోనే నిష్క్రమించడంపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమి కారణంగా భారత్ సెమీఫైనల్‌కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించడం నిరాశ కలిగించిందన్నారు. అయితే ఈ పరాజయానికి అసలు కారణం ఆస్ట్రేలియాతో మ్యాచ్ కాదని, అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పేలవమైన ఫీల్డింగ్ వల్ల వచ్చిన ఓటమే టోర్నీ నుంచి భారత్‌ను దాదాపు బయటకు నెట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై కూడా గవాస్కర్ సందేహాలు వ్యక్తం చేశారు. టోర్నీలో పూర్తిగా ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లనే భారత జట్టు బరిలోకి దించిందా అనే ప్రశ్నను లేవనెత్తారు. ఒకవేళ మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపుతిప్పగల స్టార్ ఆటగాళ్లు అయితే కొంత గాయం ఉన్నా ఆడించడం సమంజసమేనని, కానీ సాధారణ పరిస్థితుల్లో పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నవారికే అవకాశం ఇవ్వాలని అన్నారు. ఆటగాళ్లు బ్యాండేజీలతో మైదానంలో కనిపిస్తే అభిమానుల్లో అనవసర ఆందోళన కలుగుతుందని గవాస్కర్ వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!