
జనరల్

జర్మనీ ఫిఫా వరల్డ్ కప్ 2026లో అద్భుత ఆరంభాన్ని నమోదు చేసింది. కురసావోతో జరిగిన మ్యాచ్‌లో 7-1 తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ పోరులో తమ బలాన్ని చాటుకుంది. ఫెలిక్స్ న్మెచా, నికో ష్లోటర్‌బెక్, కై హావెర్ట్జ్, జమాల్ ముసియాలా, నాథనియెల్ బ్రౌన్, డెనిజ్ ఉండావ్ గోల్స్‌తో జర్మనీ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఈ విజయంతో వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన జట్టుగా జర్మనీ తన రికార్డును మరింత మెరుగుపరుచుకుంది.
మరోవైపు కురసావో ఓటమి పాలైనప్పటికీ చారిత్రక ఘట్టాన్ని నమోదు చేసింది. 21వ నిమిషంలో లివానో కోమెనెన్సియా చేసిన గోల్ కురసావో ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో తొలి గోల్‌గా నిలిచింది. జర్మనీ దాడులను తట్టుకోలేకపోయిన కురసావో చివరకు భారీ తేడాతో ఓడిపోయినా, తమ దేశ ఫుట్‌బాల్ చరిత్రలో చిరస్మరణీయ క్షణాన్ని సొంతం చేసుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!