
ఆరోగ్యం

కామన్వెల్త్ క్రీడల్లో దేశానికి పతకాల పంట పండించిన భారత క్రీడాకారులు మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. దేశ రాజధానిలో వారికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఏడు స్వర్ణ పతకాలు సాధించిన భారత బాక్సర్లతో పాటు జూడోలో భారత్‌కు చారిత్రాత్మక స్వర్ణ పతకం అందించిన అస్మితకు ఎయిర్‌పోర్ట్‌లో ఘన సన్మానం లభించింది. అభిమానులు పూలమాలలు, రూ.50 నోట్లతో తయారు చేసిన దండలతో క్రీడాకారులను అభినందించారు.
ఈ సందర్భంగా జూడో స్వర్ణ పతక విజేత అస్మిత తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. జూడోలో భారత్‌కు స్వర్ణ పతకం అందించాలనేది తన చిరకాల కల అని తెలిపింది. గ్లాస్గోకు వెళ్లినప్పటి నుంచే బంగారు పతకంతో తిరిగి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నానని, ఆ కల నెరవేరడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!