

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా సుదీర్ఘకాలం కొనసాగిన హర్మన్‌ప్రీత్ కౌర్ అన్ని ఫార్మాట్లలో నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం అంత సులభంగా తీసుకోలేదని పేర్కొన్న ఆమె.. కెప్టెన్‌గా తన కర్తవ్యం పూర్తయిందని భావిస్తున్నట్లు తెలిపారు. కెప్టెన్సీ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు, విమర్శలు, కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ జట్టు ప్రయోజనాలకే ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చానని హర్మన్‌ప్రీత్ వెల్లడించారు.
అయితే క్రికెటర్‌గా తన ప్రయాణాన్ని కొనసాగించనున్నట్లు హర్మన్‌ప్రీత్ స్పష్టం చేశారు. తనకు అండగా నిలిచిన జట్టుసభ్యులు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్, మేనేజ్మెంట్, బీసీసీఐ, కుటుంబ సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 2012లో తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హర్మన్‌ప్రీత్.. 2016లో పూర్తిస్థాయి సారథిగా మారారు. ఆమె నాయకత్వంలో భారత జట్టు ఐదు టెస్టులు, 51 వన్డేలు, 155 టీ20లు ఆడింది. ఆమె సారథ్యంలో వన్డే ప్రపంచకప్ విజయం, ఆసియా క్రీడల్లో వరుసగా రెండో స్వర్ణం వంటి ఘనతలు భారత్ సాధించింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!