

లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక మహిళల టెస్టు మ్యాచ్‌లో భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. మహిళల క్రికెట్‌లో తొలిసారిగా లార్డ్స్‌లో నిర్వహిస్తున్న టెస్టులో ఆమె అద్భుత హాఫ్ సెంచరీ నమోదు చేసి, ఆ చారిత్రాత్మక వేదికపై టెస్టు అర్ధశతకం సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. మంధాన కేవలం 50 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేయగా, ఆమె ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.
ఈ ఇన్నింగ్స్‌తో మంధాన మరో అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకుంది. మహిళల టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన భారత క్రికెటర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. 2021లో ఆస్ట్రేలియాపై 51 బంతుల్లో సాధించిన తన రికార్డును అధిగమిస్తూ, ఈసారి 50 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 25 ఓవర్ల ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. మంధాన 56 పరుగులతో, హర్మన్‌ప్రీత్ కౌర్ 15 పరుగులతో క్రీజులో నిలిచారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!