

దంబుల్లా వేదికగా జరిగిన త్రిసిరీస్ వన్డే ఫైనల్లో భారత్ ఏ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంక ఏ జట్టుపై 66 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 94 పరుగులతో చెలరేగి లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కెప్టెన్ తిలక్ వర్మ 67 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, కుమార్ కుషాగ్రా, అనుకుల్ రాయ్ చివర్లో విలువైన పరుగులు జోడించారు. దీంతో భారత్ ఏ జట్టు 9 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
లక్ష్య ఛేదనలో శ్రీలంక ఏ జట్టు పోరాడినా విజయానికి చేరుకోలేకపోయింది. వనుజ సహన్, సమరవిక్రమ అర్థ శతకాలతో రాణించినా మ్యాచ్‌ను మలుపుతిప్పలేకపోయారు. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టగా, అనుకుల్ రాయ్ బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. దీంతో భారత్ ఏ జట్టు ఘన విజయంతో ట్రోఫీని సొంతం చేసుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!