

టీమిండియా మాజీ క్రికెటర్ కర్సాన్ ఘావ్రి జస్‌ప్రీత్ బుమ్రా దీర్ఘకాలిక ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని బీసీసీఐకి సూచించారు. ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో గాయపడిన బుమ్రా, గాయం తిరగబెట్టడంతో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. పూర్తిగా కోలుకునే వరకు అవసరమైతే ఆరు నెలలు లేదా ఏడాది పాటు విశ్రాంతి ఇవ్వాలని, 100 శాతం ఫిట్‌గా మారిన తర్వాతే జట్టులోకి తీసుకోవాలని ఘావ్రి అభిప్రాయపడ్డారు.
బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ను మరింత జాగ్రత్తగా నిర్వహించాలని సూచించిన ఘావ్రి, అతడిని ప్రధానంగా టెస్టు క్రికెట్‌కే పరిమితం చేయాలని పేర్కొన్నారు. ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శన చేసిన మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌లను తిరిగి భారత జట్టులోకి తీసుకోవాలని సూచించారు. అలాగే టెస్టుల్లో షమీ, మహ్మద్ సిరాజ్‌లను రొటేషన్ పద్ధతిలో వినియోగిస్తే బుమ్రాపై ఒత్తిడి తగ్గి అతడి కెరీర్ మరింత కాలం కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!