

శ్రీలంకతో గాలెలో ప్రారంభమైన తొలి టెస్టులో టీమ్‌ఇండియా తొలి రోజే ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడినా 73 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. దేవ్‌దత్ పడిక్కల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో 131 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెరీర్‌లో తొలి టెస్టు శతకాన్ని నమోదు చేసిన అతడు భారత ఇన్నింగ్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. కేఎల్ రాహుల్ 77 పరుగులతో కీలక సహకారం అందించి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
2024 తర్వాత మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చిన పడిక్కల్.. మూడో స్థానంలో ఎంతో పరిణతితో బ్యాటింగ్ చేశాడు. 134 బంతుల్లో తొలి టెస్టు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాహుల్‌తో కలిసి 150 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత ఇన్నింగ్స్‌కు పటిష్ఠ పునాది వేశాడు. 127 బంతుల్లో అర్ధశతకం సాధించిన రాహుల్.. అనంతరం అసౌకర్యానికి గురై రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అంతకుముందు యశస్వి జైస్వాల్ 32 పరుగుల వద్ద రనౌట్ కాగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 16 పరుగులకు ఔటయ్యాడు. ఆ తర్వాత పడిక్కల్‌కు రిషభ్ పంత్ అండగా నిలిచాడు. పంత్ 27 పరుగులతో అజేయంగా ఉన్నాడు. భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున టెస్టు సెంచరీ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా పడిక్కల్ ప్రత్యేక రికార్డు నమోదు చేశాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!