
జనరల్

ఆసియా జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు మయాంక్ చక్రవర్తి, ప్రతీతి బోర్డోలోయ్ క్లాసికల్ విభాగాల్లో టైటిళ్లు కైవసం చేసుకున్నారు. నేడు జరిగిన ఆఖరి రౌండ్‌ను డ్రాగా ముగించిన మయాంక్ 7.5 పాయింట్లతో బాలుర విభాగంలో విజేతగా నిలిచాడు. రష్యాకు చెందిన ఆర్టిం పిన్‌జిన్ రజతం, భారత్‌కు చెందిన దక్ష్ గోయెల్ కాంస్యం సాధించారు.
బాలికల క్లాసికల్ విభాగంలో ప్రతీతి కూడా ఆఖరి రౌండ్‌ను డ్రాగా ముగించి 7.5 పాయింట్లతో స్వర్ణ పతకం అందుకుంది. కజకిస్థాన్‌కు చెందిన మరియా ఖోల్యావ్‌కో రజతం, భారత క్రీడాకారిణి నివేదిత కాంస్యం సాధించారు. తెలుగు క్రీడాకారులు శరణ్య, అద్వైత్ తమ విభాగాల్లో ఆరో స్థానంతో నిలిచారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!