
సినిమాలు

ఆసియా జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లు టైటిళ్లకు చేరువయ్యారు. బాలికల క్లాసికల్ విభాగంలో ప్రతీతి బోర్డోలోయ్ ఎనిమిదో రౌండ్‌లో విజయం సాధించింది. తొమ్మిదో రౌండ్‌లో తెలుగమ్మాయి శ్రావ్యశ్రీతో తలపడిన ఆమె డ్రాతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం ప్రతీతి ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, శ్రావ్యశ్రీ 6.5 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది.
బాలుర క్లాసికల్ విభాగంలో తొమ్మిదో రౌండ్‌ను డ్రాగా ముగించిన మయాంక్ చక్రవర్తి 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. తొమ్మిదో రౌండ్‌లో సిద్ధాంత్‌పై విజయం సాధించిన హైదరాబాద్ ఆటగాడు విఘ్నేష్ అద్వైత్ వేముల 6.5 పాయింట్లతో ఆరో స్థానానికి చేరుకున్నాడు. బుధవారం జరిగే చివరి రౌండ్‌లో టైటిల్ విజేతలు ఎవరో తేలనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!