

ఐపీఎల్, బీసీసీఐపై విమర్శలు చేస్తున్న మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లపై భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ తీవ్రంగా స్పందించారు. విదేశీ ఆటగాళ్లు తమ జాతీయ జట్ల కంటే ఐపీఎల్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని ముఖ్యంగా ఇంగ్లాండ్‌కు చెందిన పలువురు మాజీ క్రికెటర్లు ఆరోపణలు చేశారు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన జోఫ్రా ఆర్చర్‌ను లక్ష్యంగా చేసుకుని, అతడు టెస్ట్ క్రికెట్ కంటే ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు ప్రాధాన్యం ఇచ్చాడని విమర్శించారు. అలెస్టర్ కుక్, సైమన్ డౌల్, మైకేల్ ఆర్థర్టన్ వంటి మాజీ ఆటగాళ్లు కూడా ఈ అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ విమర్శలకు సమాధానంగా గావస్కర్ ఒక ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసంలో ఘాటుగా స్పందించారు. ఐపీఎల్‌పై విమర్శలు చేసే వారు తమ దేశ క్రికెట్ బోర్డులు విదేశీ ఆటగాళ్ల ఐపీఎల్ ఆదాయంలో పొందుతున్న వాటా గురించి మాట్లాడరని ఆయన అన్నారు. బీసీసీఐ మాత్రమే విదేశీ ఆటగాళ్ల ఆదాయంలో ఒక భాగాన్ని ఆయా క్రికెట్ బోర్డులకు అందజేస్తోందని గుర్తుచేశారు. ‘ది హండ్రెడ్’, బిగ్ బాష్ లీగ్ వంటి ఇతర టోర్నీలు అలాంటి విధానాన్ని పాటించడం లేదని పేర్కొన్నారు. భారత క్రికెట్‌ను ఎంత విమర్శించినా, ఐపీఎల్ మరియు బీసీసీఐ ప్రపంచ క్రికెట్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంటాయని గావస్కర్ స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!